Health benefits: బంగాళాదుంపలు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే కూరగాయల్లో ఒకటి. మన దేశంలోనూ వీటి వినియోగం విస్తృతంగానే ఉంటుంది. దాళీలో బంగాళాదుంపలు వేసి వండితే వంటకం రుచికరంగా మారడమే కాకుండా శరీరానికి శక్తినీ అందిస్తుంది.
బంగాళాదుంపల్లో గ్లూకోజ్ అధికంగా ఉండడం వలన ఇవి తక్షణ శక్తిని అందించే ఆహారంగా మారాయి. అలాగే విటమిన్ C, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్ వంటి అనేక ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. బంగాళాదుంపలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సవ్యంగా కొనసాగించడంలో సహాయపడుతుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే – బంగాళాదుంపలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలిగి ఉంటాయి. కాబట్టి దాళీలో బంగాళాదుంపలను చేర్చడం వలన రుచితో పాటు పౌష్టిక విలువ కూడా రెట్టింపవుతుది.