Ash Gourd Juice: బూడిద గుమ్మడికాయ కేవలం కూరగాయ మాత్రమే కాదు.. అన్ని వ్యాధులను నయం చేసే ఔషధం కూడా. మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం. బూడిద గుమ్మడికాయ అనేక ఔషధ గుణాలతో నిండిన అత్యంత పోషకమైన ఆహారం. దీనిని ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా గుమ్మడి రసం పోషకాలతో నిండి ఉంటుంది. ఇది ఐరన్, కాల్షియం, పాస్పరస్, జింక్, మెగ్నీషియం, కాపర్ వంటి మినరల్స్‌ను కలిగి ఉంటుంది. నియాసిన్, థియామిన్, విటమిన్ సి, రిబోఫ్లేవిన్ వంటి విటమిన్లకు మూలం. దీని రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటారు. మీరు రోజూ దాని రసం తీసుకుంటుంటే..కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం..
గుమ్మడి రసం ఉపయోగాలు :
ఖాళీ కడుపుతో గుమ్మడికాయ రసం తాగడం వల్ల వ్యాధులను దూరంగా ఉంచవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ జ్యూస్‌ను రోజూ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారు.
గుమ్మడికాయ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడికాయలోని విటమిన్లు, మినరల్స్, ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడతాయి.
Also Read: Health Tips: తిన్నది జీర్ణం అవ్వడం లేదా..? అయితే ఇలా చేయండి..
నిద్రలేమితో బాధపడేవారికి బూడిద గుమ్మడికాయ రసం మంచి ఎంపిక. ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకుంటే, నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.
రోజూ గుమ్మడికాయ రసం తీసుకోవడం వల్ల వాతం, పిత్త దోషాలు సమతుల్యం అవుతాయి. ఈ కూరగాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుమ్మడికాయ రసం తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడి సమస్య తొలగిపోతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.
ఈ రసం మూత్ర సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల యూటీఐ తగ్గుతుంది. మీకు మంచి శక్తి లభిస్తుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి.
గుమ్మడి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం నుండి మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.