Hyderabad: అక్కడ న్యాయం చేయాల్సిన ఎస్‌ఐ ఆ పనిచేయంకుండా ఫోన్ నంబర్ తీసుకుని తాను కూడా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో బాధితురాలు కమిషనర్ ను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది. హయత్ నగర్ లో ఓ మహిళను భర్త వేధింపులకు గురి చేయడంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఫోన్ నంబర్ తీసుకున్న ఎస్ఐ సైదులు నీ కేసు నేను పరిష్కరిస్తా.. మీ ఇంటికి వస్తా అంటూ ఫోన్లు చేసి వేధించడం మొదలు పెట్టాడు.
తన భర్త మూడు తులాల బంగారంతో పాటు రూ.2 లక్షలను ఇంటి నుండి తీసుకువెళ్లాడని ఫిర్యాదు చేస్తే రూ.65వేలు మాత్రమే తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొనాలని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చెప్పు వస్తా.. అంటూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు.
Hyderabad: విషయం బయటకు రావడంతో స్టేషన్ కు పిలుపించుకుని ఎవరకీ చెప్పొంద్దని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వస్తాడేమోనని ఎంతో బయపడిపోయింది. దీంతో ఆ మహిళ రాజకొండ కమిషనర్ సుధీర్ బాబును కలిసి ఫిర్యాదు చేసింది. గత 40 రోజులుగా తనను ఎస్సై వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.