PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత ప్రభుత్వం అందిస్తుందని, స్థానిక వియత్నాం అధికారులతో మన అధికారులు నిరంతరం మాట్లాడుతున్నారని ఆయన హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదంపై పీఎం మోదీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
“వియత్నాంలోని ఫు క్వాక్ దీవి సమీపంలో భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైందనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి, గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వియత్నాంలోని మన భారత రాయబార కార్యాలయం (ఎంబసీ), కాన్సులేట్ అధికారులు బాధితులకు తోడుగా ఉంటూ సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారు. మన అధికారులు స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు,” అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

