Vennalakishore: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇందులో వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించారని రైటర్ మోహన్ తెలిపారు. ‘షెర్లాక్ హోమ్స్’ అనే పదంలోనే మూడు పాత్రలు ఇమిడి ఉన్నాయని ఆయన చెప్పారు. షెర్ అంటే శర్మిలమ్మ, తల్లి పాత్ర. లోక్ అంటే లోకనాథం… తండ్రి పాత్ర.. అలానే హోమ్ అంటే ఓంప్రకాశ్! ఈ మూడు ఇందులో కీలకమైనవే అని తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో 1990 ప్రాంతానికి సంబంధించిన కథ ఇదని ఆయన అన్నారు. థ్రిల్లింగ్ అంశాలతో ఫన్నీగా మూవీ ఉంటుందని అన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు.