Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన బీసీ హక్కుల ధర్నా పై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలనే నినాదంతో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు, అక్కడ చేసిన ధర్నా “ఒక డ్రమా”గా మిగిలిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీలకు 42శాతం కోటా పేరిట రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి రాహుల్ గాంధీ రాలేదు. మాకు బీసీ కన్న బిహారే ముఖ్యమని మల్లికార్జున ఖర్గే రాలేదు.
మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు 42శాతం కోటా అమలు చేస్తారనే మాటలపై నమ్మకం రాహుల్ గాంధీ, ఖర్గే లతో పాటు, తెలంగాణ ప్రజలకు కూడా లేదని సుస్పష్టం అయ్యింది అని హరీష్ రావు.
‘‘మేం గుజరాత్ లో అడగలేదు, ఉత్తర్ ప్రదేశ్ లో అడగలేదు, మహారాష్ట్రలో అడగలేదు తెలంగాణలోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అడుగుతున్నాం’’ అని రేవంత్ రెడ్డి ప్రసంగిస్తే..
అన్నారు అదే సమయంలో రాహుల్ గాంధీ గారూ.. ‘‘ఈ పోరాటం తెలంగాణ కోసం మాత్రమే కాదు, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటం’’ అని ట్వీట్ చేస్తరు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్ గాంధీ చెప్పిన మాటలకే పొంతన లేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో రెండు నాల్కల దోరణి చూస్తేనే అర్థమవుతున్నది.
బీసీలకు 42శాతం కోటా పేరిట @revanth_anumula అండ్ బ్యాచ్ ఢిల్లీ వెళ్లిన చేసిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఢిల్లీ వేదికగా నిర్వహించిన దొంగ దీక్షకు.. కూతవేటు దూరంలో ఉండి @RahulGandhi రాలేదు.
మాకు బీసీ కన్న బిహారే ముఖ్యమని @kharge రాలేదు.మీ ధర్నాలో నిజాయితీ లేదని, బీసీలకు… pic.twitter.com/IgAbTB4SLv
— Harish Rao Thanneeru (@BRSHarish) August 6, 2025