Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మొదట మే 9న రిలీజ్ కావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. తాజాగా బుక్ మై షో సైట్లో ఈ చిత్రం జూన్ 12న విడుదల కానుందన్న అనధికారిక సమాచారం లీక్ కావడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే, ఈ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

