Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ వారంలో పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కి అందుబాటులో ఉండేలా స్పెషల్ గా డబ్బింగ్ సెటప్ ను కూడా ఏర్పాటు చేశారట. పవన్ కళ్యాణ్ కేవలం ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఆయన డేట్స్ ఇస్తే సినిమా పూర్తయిపోతుంది.సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
