Harbhajan Singh: పదేండ్లుగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో తనకు మాటల్లేవంటూ గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మేమిద్దరం స్నేహితులం కాదని, ఐపీఎల్‌లో 2018-20 మధ్య సీఎస్కే తరఫున ఆడినప్పుడు కూడా మైదానంలోనే అది కూడా పరిమితంగానే మాట్లాడుకున్నట్లు భజ్జీ తెలిపాడు. కారణాలు తెలియదు కానీ.. నాకు, ధోనీతో ఏ సమస్య లేదు. అతనే మాట్లాడటం లేదు. నేనెప్పుడూ ధోనీకి ఫోన్ చేయను.
ఇది కూడా చదవండి: Pink Ball Test: పింక్ బాల్ టెస్టుకు ముందు గందరగోళంలో ఆసీస్..జట్టులో విభేదాలంటూ వార్తలు
Harbhajan Singh: నా ఫోన్ కాల్స్‌కి ఎవరైతే స్పందిస్తారో వారికే చేస్తానంటూ షాకింగ్ విషయం వెల్లడించాడు. స్నేహితులుగా ఉన్న వారితో టచ్‌లో ఉంటానంటూనే ఎవరికైనా ఒకట్రెండుసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోతే వారిని అవసరమైనప్పుడు మాత్రమే కలుస్తానని టర్బొనేటర్ చెప్పాడు. కాగా, ధోనీ కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు టోర్నీల్లో హర్భజన్ భారత్ తరఫున భజ్జీ ఆడడం విశేషం.