Mumbai: మహారాష్ట్రలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీజేపీ కోర్ గ్రూప్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అధికారికంగా ప్రకటించారు. ఫడ్నవీస్ శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నికయ్యారు. రేపు (5 డిసెంబర్ 2024) ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారంలో ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఎంపికైన నేతలు కూడా ప్రమాణం చేయనున్నారు.
ఈ ప్రక్రియలో ముఖ్యంగా మహాయుతి నేతలు ఈరోజు (4 డిసెంబర్) సాయంత్రం 3:30 గంటలకు మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. ఆతరువాత అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటును ప్రకటించనున్నారు. కాగా, ఫడ్నవీస్ గతంలో కూడా మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు.