Prabhas

Prabhas: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్: బాక్సాఫీస్‌కు రాజు, వ్యక్తిత్వంలో రారాజు!

Prabhas: నేడు, అక్టోబర్ 23, భారతీయ సినీ పరిశ్రమలో ఒక ముఖ్యమైన రోజు. ఈ రోజు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ఆయన ప్రయాణం ఒక నటుడి స్థాయిని దాటి, స్వయంగా ఒక పరిశ్రమగా మారిపోయింది. మన సినిమా శక్తిని వందల కోట్ల నుంచి వేల కోట్ల మార్కెట్‌కు మార్చగలిగిన అరుదైన ఘనత ప్రభాస్‌కే దక్కుతుంది. ‘డార్లింగ్‌కి కథ నచ్చేసిందట’ అనే మాట వినబడితే చాలు, ఆ సినిమాపై దక్షిణ భారతం నుంచి ఉత్తరాది వరకూ, అలాగే ఓవర్సీస్‌లో కూడా వ్యాపారాలు చురుగ్గా సాగిపోతాయి. నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన – అన్ని విభాగాల్లోనూ ఈ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది.

బాహుబలి తర్వాత చెరిగిపోయిన భాషా హద్దులు
ఉత్తరాది (హిందీ)లో స్థానం సంపాదించాలని ఎంతో మంది దక్షిణాది హీరోలు ప్రయత్నించారు, కానీ ప్రభాస్‌తోనే ఆ భాషా హద్దులు చెరిగిపోయాయి. ‘బాహుబలి’ సినిమాల తర్వాత తెలుగు, హిందీ అనే తేడా లేకుండా ప్రభాస్ కటౌట్ అందరినీ ఆకట్టుకుంది. ప్రేక్షకులకు ఆయన **”డార్లింగ్”**గా మారిపోయారు. తెరపై ఆయన రూపమే కాదు, ఆయన మాట వినిపించినా చాలు, అది సినిమాకు మరింత శక్తినిస్తుంది. ఇటీవల ఘన విజయం సాధించిన ‘మిరాయ్’ సినిమాలో ఆయన గొంతు దీనికి ఉదాహరణ. అందుకే ఆయన పాన్ ఇండియా స్టార్ అనే పదానికి నిజమైన నిర్వచనంగా నిలిచారు.

Also Read: Nara Rohit: నారా రోహిత్ పెళ్లి డేట్ ఫిక్స్.. నాలుగు రోజులు వేడుక‌

పుట్టినరోజు సందర్భంగా భారీ చిత్రాల సందడి
ప్రభాస్ తన పుట్టినరోజును అభిమానులతో పంచుకునేందుకు క్రేజీ అప్‌డేట్స్‌తో సిద్ధమయ్యారు. రెబల్ ఫ్యాన్స్‌కు ఇది దీపావళితో సమానం. ఆయన సినిమాలు వందల కోట్ల బడ్జెట్‌తో, రెండు లేదా మూడు భాగాలుగా రూపొందుతున్నాయి. ఆ లైనప్ చూస్తే అభిమానులకు పూనకాలు రావాల్సిందే.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ది రాజా సాబ్ (మారుతి దర్శకత్వం) చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ పాత, వింటేజ్ లుక్‌లో, రొమాంటిక్ హారర్ కామెడీలో కనిపించనున్నారు. అలాగే, డైరెక్టర్ హను రాఘవపూడి (మైత్రీ మూవీ మేకర్స్)తో ఒక సినిమా, సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు, ‘సలార్ 2’, ‘కల్కి 2’ వంటి సీక్వెల్స్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 31న ప్రభాస్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి: ది ఎపిక్’ (రెండు భాగాలు కలిపి ఒకే పార్ట్‌గా) తిరిగి విడుదల కానుంది.

స్టార్‌డమ్‌ను మించిన వ్యక్తిత్వం
బాక్సాఫీస్ రికార్డులు ప్రభాస్‌ను ‘స్టార్’గా నిలబెడితే, ఆయన వ్యక్తిత్వం ఆయన్ను అందరి **”డార్లింగ్”**గా మార్చింది. మచ్చలేని జీవితం, శత్రువు ఎరుగని వ్యక్తిత్వం, చేతికి ఎముకలేని దాతృత్వం, మర్చిపోలేని ఆతిథ్యం – ఇవే ప్రభాస్‌ను అందరికీ ఇష్టమైన వ్యక్తిగా చేశాయి. ఇండస్ట్రీలో అందరినీ సమానంగా చూస్తారు. అమితాబ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రభాస్ పెట్టే ఫుడ్, ఆయన ఆతిథ్యం గురించి ప్రశంసించారు. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ, ఇంటికి వచ్చే అభిమానులకు కడుపు నిండా భోజనం పెట్టేవరకు పంపించరని చెబుతుంటారు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడూ ఒదిగే ఉంటారు. తక్కువగా మాట్లాడి, ఎక్కువ పనిచేయడం ఆయన విజయ రహస్యం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రభాస్ మరిన్ని విజయాలు సాధించి, ఇలాంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్‌కు హ్యాపీ బర్త్ డే!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *