H1B Visa:అమెరికా హెచ్1బీ వీసాపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది. నిన్న హెచ్1 బీ వీసా కింద ఉద్యోగంలో చేరిన ఉద్యోగి తరఫున ఏటా లక్ష డాలర్ల చొప్పున కంపెనీలు చెల్లించాలంటూ ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఆదేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ బిల్లుపై సంతకం చేశారు. ఆ వెంటనే టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. విదేశాల్లో ఉన్న తమ కంపెనీ ఉద్యోగులైన హెచ్1బీ వీసాదారులు సత్వరమే అమెరికాకు తిరిగి రావాలని మెయిల్స్ పంపాయి.
H1B Visa:ఈ నేథప్యంలో వైట్‌హౌస్ నుంచి వచ్చిన మరో కీలక ప్రకటనతో అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా వైట్‌హౌస్ సిథటరీ కరోబిన్ లీవిల్ ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. లక్ష డాలర్ల ఫీజు ఏడాదికి ఒకసారి కాదని, ఇది వన్‌టౌమ్ సెటిల్మెంట్ అని తేల్చి చెప్పారు. అంతే కొత్తగా ఉద్యోగంలోకి చేర్చుకునేటప్పుడు లక్ష డాలర్లు చెల్లిస్తే చాలని పేర్కొన్నారు.
H1B Visa:అదే విధంగా అమెరికా బయట ఉన్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఊరట కల్పించారు. ఎప్పటిలాగే అమెరికాకు తిరిగి రావచ్చని, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. రెన్యువల్‌కు కూడా ఈ ఫీజు వర్తించదని క్లారిటీ ఇచ్చారు. అదే విధంగా ఎఫ్1 వీసా కలిగిన వారికి కూడా ఇది వర్తించదని తేల్చి చెప్పారు.