India Economy: దేశం నుండి జరుగుతున్న మొత్తం ఎగుమతులలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.83 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు గుజరాత్ నుండి జరిగాయి, ఇది మొత్తం దేశ ఎగుమతుల్లో 33.5% వాటా కలిగి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో, తెలంగాణ ఏడవ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్: 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.80 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి, ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 4.75% వాటా. తెలంగాణ అదే ఆర్థిక సంవత్సరంలో రూ. 1.66 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి, ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 4.37% వాటా.
Also Read: Kartavya Bhavan: ఢిల్లీలో ఆధునిక పాలనకు కొత్త శకం: కర్తవ్య భవన్ ప్రారంభం
గుజరాత్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.83 లక్షల కోట్ల విలువైన ఎగుమతులతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 33.5% వాటాను కలిగి ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు కర్ణాటకతో కలిపి, ఈ నాలుగు రాష్ట్రాలు దేశం మొత్తం ఎగుమతుల్లో 70%కి పైగా వాటాను కలిగి ఉన్నాయి. 2022 సంవత్సరానికి గానూ నీతి ఆయోగ్ విడుదల చేసిన ఎగుమతి సన్నద్ధత సూచీ (Export Preparedness Index) ప్రకారం, కోస్తా తీరం లేని రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ఆరవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువగా సముద్ర ఆధారిత ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఎగుమతులు పెరిగాయి. దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో కూడా గుజరాత్ అగ్రస్థానంలో ఉంది.

