Gujarat: గుజరాత్ రాష్ట్రంలోని గోల్‌వాడ వద్ద జగన్నాథస్వామి రథయాత్రలో అపశృతి చోటుచేసుకున్నది. రథయాత్రలో భాగంగా ఉన్న ఏనుగులలో ఒకటి ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. దీంతో భక్తులంతా భయంతో పరుగులు తీశారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.
Gujarat: జగన్నాథస్వామి రథయాత్రలో పలు ఏనుగులను ముస్తాబు చేసి ప్రదర్శనలో మావటిల సాయంతో పాల్గొన్నారు. అయితే వాటిలో ఓ ఏనుగు అదుపు తప్పి పరుగులు తీసింది. జనంపైకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.

