GST 2.0

GST 2.0: జీఎస్టీ అమలులో ఉన్న.. ధరలు తగియకుండా పాత రేట్ కే అమ్ముతున్నారా..? ఇలా ఫిర్యాదు చేయండి

GST 2.0: దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రజలకు ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక వస్తువులపై పన్నులను తగ్గించింది. అయితే కొంతమంది వ్యాపారులు ఇంకా పాత ధరలకే వస్తువులను విక్రయిస్తూ వినియోగదారులను నష్టపరుస్తున్నారని సమాచారం. దీంతో ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసి, ఫిర్యాదుల కోసం పలు సులభమైన అవకాశాలను కల్పించింది.

ఒకే వస్తువుపై రెండు ధరలు

కొత్త రేట్లు అమలులోకి రావడంతో మార్కెట్లో ఒకే ఉత్పత్తికి రెండు ధరలు (MRPలు) కనిపించడం సహజం. ఒకటి పాత ధర, మరొకటి కొత్త ధర. వినియోగదారులు మాత్రం తప్పనిసరిగా కొత్త GST రేటు ప్రకారం తగ్గించిన ధరనే చెల్లించాలి. కంపెనీలు పాత స్టాక్‌పై కూడా కొత్త రేట్లతో స్టిక్కర్లు అతికించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Parakamani Backdoor: దేవుడి పైనే భారం? టీటీడీలో వింత పరిస్థితి!

దుకాణదారులు ఎక్కువ వసూలు చేస్తే?

చిన్న దుకాణదారులు ఎక్కువగా పాత ధరకే వస్తువులను అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇలా జరిగితే వినియోగదారులు పన్ను మినహాయింపు పొందలేరు. ఇలాంటి సందర్భాల్లో మౌనంగా ఉండకుండా నేరుగా ఫిర్యాదు చేయడం ద్వారా మీరు మీ హక్కును సాధించుకోవచ్చు.

ఎక్కడ? ఎలా ఫిర్యాదు చేయాలి?

వస్తువును తప్పుడు ధరకు అమ్మినా లేదా ఎక్కువ వసూలు చేసినా వినియోగదారులు ఉచితంగా ఫిర్యాదు చేయవచ్చు.

  • వెబ్‌సైట్ ద్వారా: consumerhelpline.gov.inలో నమోదు చేసి OTPతో లాగిన్ అయి ఫిర్యాదు వివరాలు నమోదు చేయాలి. బిల్లు లేదా ఫోటోలు వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.

  • ఫోన్ ద్వారా: టోల్-ఫ్రీ నంబర్ 1915కు కాల్ చేయవచ్చు.

  • WhatsApp/SMS ద్వారా: మొబైల్ నంబర్ 8800001915కు మెసేజ్ పంపవచ్చు.

  • యాప్ ద్వారా: నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ యాప్ లేదా ఉమాంగ్ యాప్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఈ మార్గాల ద్వారా పంపిన ఫిర్యాదులు నేరుగా ప్రభుత్వానికి చేరి పరిష్కరించబడతాయి.

ఇది కూడా చదవండి: H1B Visa: హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నుంచి డాక్టర్లకు మినహాయింపు?

అసలు ధరను ఎలా తెలుసుకోవాలి?

వినియోగదారుల గందరగోళాన్ని నివారించేందుకు ప్రభుత్వం savingwithgst.in అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇక్కడ ఉత్పత్తి పేరు నమోదు చేస్తే, GST తగ్గింపు తర్వాత దాని సరైన ధరను తెలుసుకోవచ్చు.

తుది మాట

ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు ద్వారా వినియోగదారులకు లాభం చేకూర్చాలనుకుంటోంది. అయితే వ్యాపారులు పాత ధరలకే వస్తువులను అమ్మితే ఆ ప్రయోజనం తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి వినియోగదారు కొత్త MRPను చెక్ చేసి, తప్పు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా తన హక్కును రక్షించుకోవాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *