ఆరోగ్య శాఖ దృష్టికి ఈ ఘటన వచ్చేసరికి… మంత్రి ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ డాక్టర్ అనితతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలుషిత ఆహారాన్ని సరఫరా చేసిన డైట్ కాంట్రాక్టర్ జైపాల్‌రెడ్డిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఆదేశాలతో ఆసుపత్రి పరిపాలన కూడా వెంటనే స్పందించి చర్యలు చేపట్టింది.
అస్వస్థతకు గురైన వారిలో 18 మంది తీవ్ర లక్షణాలతో ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మంత్రి స్వయంగా ఉస్మానియాను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంపిన స్వీట్ వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపించి పరీక్షలు చేయిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ..?
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. డీఎంఈ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ముందస్తు నివేదికలో ప్రధాన కారణం కలుషితాహారమేనని తేలింది. దీనిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎర్రగడ్డ ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ పద్మజను విధుల నుంచి తప్పించారు. ఆమె స్థానంలో ఉస్మానియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ బి. శంకర్‌ను ఇన్‌చార్జ్‌గా నియమించారు.
పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. బోరబండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఇలాంటి బాధాకర ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.
ఈ సంఘటన మానవత్వానికి మచ్చలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన మరోసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహార సరఫరా విధానాలపై ప్రశ్నలు రేపింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏ రోగీ ప్రాణాలు కోల్పోకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.