Gorati Venkanna: ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను అరుదైన గౌరవంతో అంబేద్కర్ యూనివర్సిటీ సత్కరించింది. ఇటీవలే గౌరవ డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ.. మంగళవారం (సెప్టెంబర్ 30) ఆయన ప్రదానం చేసింది. రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్ వర్మ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందజేసి సన్మానించింది. గోరటి వెంకన్న సమాజంలో సాహిత్య విభాగంలో చేస్తున్న సేవలకు గాను గురింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కిందని ఈ సందర్భంగా యూనివర్సిటీ అధికారులు ప్రశంసించారు.
Gorati Venkanna: రచయితగా, గాయకుడిగా, బహుముఖ సాహితీవేత్తగా గుర్తింపు పొంది, ప్రజాసేవకుడిగా ఎమ్మెల్సీగా సేవలందిస్తూ గోరటి వెంకన్న ఎంతో గుర్తింపు పొందారు. యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం సందర్భంగా ఇదే సమయంలో గోరటి వెంకన్నతో పాటు విద్యావేత్త ప్రేమ్రావత్కు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అదే విధంగా 35 మంది గ్రాడ్యుయేట్లకు, 51 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు బంగారు పతకాలను అందజేశారు.