Good Bad Ugly

Good Bad Ugly: దుమ్ముదులుపుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్!

Good Bad Ugly: అజిత్ కుమార్ లేటెస్ట్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ చిత్ర టీజర్ రిలీజైనప్పుడు సృష్టించిన సంచలనం మనందరం చూశాం. దర్శకుడు అధిక్ రవిచంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అజిత్ వైవిధ్యమైన గెటప్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

తాజాగా రిలీజైన ట్రైలర్ మాస్ అంటే ఏంటో మరోసారి నిరూపించింది. అజిత్ విభిన్న లుక్స్‌లో ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తూ, యాక్షన్ సీన్స్‌తో నెక్స్ట్ లెవెల్ థ్రిల్‌ను పరిచయం చేస్తున్నారు.ట్రైలర్ చూసిన అభిమానులు ‘ఇది మాకు కావాల్సిన మాస్ మసాలా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: Pawan Kalyan: డై హార్డ్ ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ కోసం రక్తం చిందించిన అభిమాని

Good Bad Ugly: ఈ భారీ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా, సిమ్రాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం మాస్ ఫీస్ట్‌గా మారనుంది. ఏప్రిల్ 10న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా చెబుతున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ ట్రైలర్ ఇక్కడ చూడండి :

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *