Ajith vs Dhanush: అజిత్ నటించిన రెండు సినిమాల్లో ఒక్కటి కూడా ఈ సారి పొంగల్ కు రావడం లేదు. ‘విడా ముయార్చి’కి దారి వదులుతూ తమ చిత్రాన్ని వాయిదా వేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో ‘విడా ముయార్చి’ మూవీ ఫిబ్రవరిలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే… ధనుష్ హీరోగా నటిస్తున్న ‘కుబేర’ అలానే అతను దర్శకత్వం వహించిన ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి గోబం’ చిత్రాలకు అజిత్ సినిమాగా పోటీగా నిలిచేలా ఉంది. ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి గోబం’ మూవీతో ధనుష్ తన మేనల్లుడు పవీష్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. దీనికి జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాధ్యూ థామస్ కీ రోల్స్ చేశారు. ‘రాయన్’ తర్వాత ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఇదే. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అలానే రెండు వారాల గ్యాప్ తర్వాత ధనుష్ హీరోగా నటించిన ‘కుబేర’ను రిలీజ్ చేస్తారని తెలిసింది. కానీ ఇదే ఫిబ్రవరి నెలలో అజిత్ ‘విడా ముయార్చి’ వస్తే.. ధనుష్ సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం చూపడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

