Good Bad Ugly Movie Twitter Review: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ నేడు, ఏప్రిల్ 10న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో సినిమా మొదటి ఆట ముగిసింది. దీంతో అక్కడివారే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లగక్కుతున్నారు.
ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మించారు. అజిత్‌కు జోడీగా త్రిష నటించగా, సపోర్టింగ్ రోల్‌లో సిమ్రాన్ కనిపించింది.
ఓవర్సీస్ టాక్ ప్రకారం, ఇది పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన సినిమా. చాలా కాలం తర్వాత అజిత్ తన అభిమానులకు ఒక పక్కా మాస్ ఎంటర్‌టైనర్ అందించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “వింటేజ్ మాస్ అజిత్ ఈజ్ బ్యాక్” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
అయితే, సినిమా చూసినవారిలో చాలామంది ఒకే మాట చెబుతున్నారు – ఇది కేవలం అజిత్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా అని. దర్శకుడు కథానాయికల పాత్రలను పెద్దగా హైలైట్ చేయలేదని, త్రిష, సిమ్రాన్‌లు స్క్రీన్‌పై ఉన్నా, వారి పాత్రలకు బలం లేకపోవడం కొంతమంది ప్రేక్షకులను నిరాశపరిచిందని చెబుతున్నారు.
ఫస్ట్ హాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్‌తో సినిమాను పుల్ మాస్‌గా తీర్చిదిద్దిన అధిక్, ఇంటర్వెల్ బ్లాక్‌లో అజిత్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే సీన్‌ను పెట్టాడని అభిప్రాయపడుతున్నారు. అయితే, సెకండ్ హాఫ్‌లో కథ కొంచెం నెమ్మదించిందని, ఎమోషనల్ కనెక్ట్ కొంత మిస్ అయిందన్న ఫీల్ కూడా వ్యక్తమవుతోంది. జీవి ప్రకాష్ సంగీతం బాగున్నప్పటికీ, కొన్ని సీన్లకు సరిగ్గా కలవలేదన్న విమర్శలు ఉన్నాయి.
మొత్తానికి, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనేది అజిత్ ఫ్యాన్స్‌కు ఫుల్ ప్యాకేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పొచ్చు. అయితే సాధారణ ఆడియెన్స్‌కు నచ్చుతుందా? అనే ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది.
Fans after the movie. Tells you about the result 🔥🔥🥵💥😁 #GoodBadUglypic.twitter.com/Vrv5BJ8FV2
— Trollywood 𝕏 (@TrollywoodX) April 10, 2025
GOOD – For Fans 💥
BAD – For Neutrals😐
UGLY – For Haters😭Strictly & Only for AK Fans!#GoodBadUgly
— Christopher Kanagaraj (@Chrissuccess) April 10, 2025
#GoodBadUgly FIRST HALF – A Pure Fans FEAST
Career Best INTRO & Title Card for AK 💥🔥 . The Placement of song Otha Ruba & @iam_arjundas ‘s Performance — Top Notch 👏 Worked Well . his Vocals 👌
kicks off with stylish shots and a standout song – a perfect blend leading up… pic.twitter.com/ZvJ33vXNDw
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) April 10, 2025
#GoodBadUgly #GoodBadUglyreview
This is just celebration of #Ajithkumar𓃵 sir 30+ years film career. Mass Mass. just a pure fanboy presentation. Mega Blockbuster 🔥🔥🔥❤️❤️❤️❤️. Book your ticket. You will not be disappointed . Loved it 😍
— Karthik (@meet_tk) April 10, 2025