Gold Rate Today

Gold Rate Today: తగ్గేదేలే అంటున్న బంగారం ధరలు.. 22, 24 క్యారెట్ల గోల్డ్ తులం ఎంతుందంటే?

Gold Rate Today: మన దేశంలో బంగారం ప్రాముఖ్యత ఎంతైనా ప్రత్యేకం. ముఖ్యంగా మహిళలకు ఇది అద్భుతమైన ఆభరణంగా, అలాగే పెట్టుబడిగా మారింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు పెరుగుతుండటం సహజం. అయితే, ఇటీవలి కాలంలో బంగారం మరియు వెండి ధరలు మారుతూ వస్తున్నాయి.ఇటీవల బంగారం ధర సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలపడటం, ఇతర ఆర్థిక పరమైన అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి.

మన దేశంలో పెట్టుబడుల‌కు ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి లోహాలు, స్థిరాస్తి రంగాలపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇటీవల కాలంలో వెండి గిరాకీ కూడా పెరుగుతుండడంతో వెండి ధరలు సైతం పెరుగుతున్నాయి.

బంగారం ధరలు (గ్రాముకు ₹లో)

క్యారెట్ 1 గ్రాము ధర
24 క్యారెట్లు ₹9,300
22 క్యారెట్లు ₹8,520
18 క్యారెట్లు ₹7,000

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు ₹లో)

నగరం 22 క్యారెట్లు 24 క్యారెట్లు
ఢిల్లీ ₹85,300 ₹93,200
ముంబై ₹85,150 ₹93,000
చెన్నై ₹85,200 ₹92,950
హైదరాబాద్ ₹85,150 ₹92,900
బెంగళూరు ₹85,150 ₹92,900
కోల్‌కతా ₹85,150 ₹92,900
విజయవాడ ₹85,150 ₹92,900
కేరళ ₹85,150 ₹92,900

వెండి ధరలు (1 కిలోకు ₹లో)

నగరం వెండి ధర
ఢిల్లీ ₹1,14,500
ముంబై ₹1,14,300
చెన్నై ₹1,14,250
హైదరాబాద్ ₹1,14,200
బెంగళూరు ₹1,14,150
కోల్‌కతా ₹1,14,350
విజయవాడ ₹1,14,100
కేరళ ₹1,14,000

బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి కాబట్టి, పెట్టుబడిదారులు, వినియోగదారులు తాజా ధరలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

(గమనిక: ఈ ధరలు మారే అవకాశం ఉంది. ఖచ్చితమైన వివరాల కోసం స్థానిక జువెలరీ షాప్స్ లేదా మార్కెట్ రేట్లను పరిశీలించండి.)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold rate: ఇవాళ బంగారం ధర ఎంత ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *