Gold Rate Hike: భారతదేశంలోని మహిళలకు బంగారు, వెండి ఆభరణాలపై మక్కువ ఎక్కువ. తరతరాలుగా ధగధగలతో మెరిసిపోవాలని అనుకుంటూ ముచ్చటపడుతుంటారు. వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో బంగారం, వెండి కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అందుకే రానురాను పసిడి, వెండి ధరలు ఇటీవల పెరుగుతూ వస్తున్నాయి. అసలు అలాంటి బంగారం భారతదేశంలో ఎంత నిల్వ ఉన్నదో? దాని విలువ ఏపాటిదో? ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది కదా.
Gold Rate Hike: ఓ వైపు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యులకు అందనంత దూరానికి బంగారం ధర వెళ్లింది. ఒక్క 2025 సంవత్సరంలోనే బంగారం ధర ఏకంగా 62 శాతం పెరిగి, ఇంకా పరుగులు పెడుతుందంటే అతిశయోక్తి కాదు. గతంలో ఆభరణాలతో ఇష్టపడేవారు. ఇప్పుడు దానిని ఒక పెట్టుబడి సాధనంగా వాడుకుంటూ కొనుగోళ్లు జరుపుతున్నారు. అందుకే అంతలా ధర పెరుగుతూ వచ్చింది.
Gold Rate Hike: ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉన్నది. ప్రపంచ బంగారం డిమాండ్‌లో చైనా 28 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, 26 శాతం డిమాండ్‌తో రెండో స్థానంలో ఉన్నది. రానురాను కూడా బంగారంపై భారత్ ప్రజలు ఆసక్తితోనే ఉంటారని, దీంతో ధరలు మరింతగా పెరుగుతాయన్నది అంచనా.
Gold Rate Hike: పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర (24 క్యారెట్లు) రూ.1.25 లక్షల మార్కు దాటింది. కిలో వెండి రూ.1.80 లక్షలు దాటింది. ఇటీవల దసరా, దీపావళి పండుగల సీజన్ కావడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. ఇలా బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో భారత ప్రజల వద్ద ఉన్న బంగారం, దాని విలువపై మోర్గాన్ స్టాన్లీ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది.
Gold Rate Hike: మోర్గాన్ స్టాన్లీ సంస్థ అంచనాల ప్రకారం.. భారతదేశంలోని ప్రజల వద్ద 34,600 టన్నుల బంగారం ఉన్నదని తేలింది. దాని విలువ 3.8 ట్రిలియన్ డాలర్లుగా అంచనా. భారత కరెన్సీలో చూసుకుంటే ప్రజల వద్ద బంగారం విలువ రూ.337 లక్షల కోట్లు అన్నమాట. ఇది మన దేశ జీడీపీలో ఏకంగా 89 శాతంగా ఉంటుందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో పేర్కొన్నది.