Gold Rate Today: దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడానికి ఇంకో కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దుర్గా పూజ, దీపావళి, ధంతేరస్ వంటి వేడుకల సమయంలో బంగారం, వెండి కొనడం ఒక సంప్రదాయం. అయితే ఈసారి ఆ ఆనందం కొంచెం ఖరీదుగా మారింది. ఎందుకంటే బంగారం, వెండి ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి.
గత ఏడాది నుంచి భారీ పెరుగుదల
2024తో పోల్చుకుంటే 2025లో బంగారం ధరలు దాదాపు 40% పెరిగాయి. ఒక సంవత్సరం క్రితం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.75,000 ఉండగా, ప్రస్తుతం అది రూ.1,11,000 దాటేసింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే తులం బంగారం మీద 35 వేలకుపైగా భారమయ్యింది.
ఇది కూడా చదవండి: H-1B Visa: H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం.. రూ.లక్ష డాలర్లు కట్టాల్సిందే
ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు
| నగరం | 24K బంగారం (10 గ్రాములు) | 22K బంగారం (10 గ్రాములు) | వెండి (1 కిలో) |
|---|---|---|---|
| హైదరాబాద్ | ₹1,11,340 | ₹1,02,060 | ₹1,33,100 |
| ఢిల్లీ | ₹1,11,490 | ₹1,02,210 | ₹1,33,300 |
| ముంబై | ₹1,11,340 | ₹1,02,060 | ₹1,33,050 |
| చెన్నై | ₹1,11,610 | ₹1,02,310 | ₹1,33,500 |
| బెంగళూరు | ₹1,11,420 | ₹1,02,180 | ₹1,33,250 |
| కోల్కతా | ₹1,11,460 | ₹1,02,200 | ₹1,33,150 |
పండుగల్లో షాపింగ్ చేసేవారు, పెళ్లిళ్లు చేసుకునే కుటుంబాలు ఈ ధరలతో ఇబ్బందిపడుతున్నారు. తులం బంగారం కొనాలంటే సుమారు ₹1.12 లక్షలు పెట్టుకోవాల్సి వస్తోంది. నిపుణులు దీపావళి సమయానికి బంగారం ధర తులానికి ₹1.25 లక్షల వరకు వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు.

