Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. మహిళలకు పెద్దగా ఊరటనిచ్చేలా ఈ తగ్గుదల లేకపోయినా, ఈ వారంలో ధరలు భారీగా పడిపోయాయని చెప్పవచ్చు. సెప్టెంబర్ 19, శుక్రవారం నాడు బంగారం, వెండి ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
బంగారం, వెండి ధరల వివరాలు
ప్రస్తుతం ఒక తులం బంగారం ధర గతంలో ఉన్న రూ. 1,13,000 నుంచి రూ. 1,11,000 కి పడిపోయింది. ఇది ఒక వారంలో చూస్తే గణనీయమైన తగ్గుదలే.
కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ తగ్గుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో అక్టోబర్ ఫ్యూచర్స్ ధర రూ. 483 తగ్గి, రూ. 1,09,339 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ. 795 తగ్గి, కిలో వెండి ధర రూ. 1,26,189కి చేరుకుంది.
అంతర్జాతీయంగా అమెరికాలో స్పాట్ గోల్డ్ ధర 0.2 శాతం తగ్గి ఔన్సుకు $3,654.29కి చేరుకుంది. ఫెడ్ సమావేశం తర్వాత డాలర్ విలువ పెరగడం, ట్రెజరీ రేట్లు పెరగడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ధర $3,600 వరకు పడిపోవచ్చని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
సెప్టెంబర్ 19 నాటికి దేశీయంగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి:
* 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములు రూ. 1,11,160
* 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములు రూ. 1,01,890
ప్రధాన నగరాల్లో ధరలు:
* ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,11,310, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,02,040
* ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,11,160, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,01,890
* హైదరాబాద్: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,11,160, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,01,890
* చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,11,480, 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,02,190
వెండి ధరలు
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 1,30,900 వద్ద ఉంది. అయితే, హైదరాబాద్, కేరళ, చెన్నై వంటి నగరాల్లో వెండి ధర కాస్త ఎక్కువగానే ఉంది. ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ. 1,40,900 వద్ద ట్రేడ్ అవుతోంది.