Gold Price Today: గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఈ ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు, యుద్ధ వాతావరణం వంటి కారణాలతో పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ల నుండి బయటకు వచ్చి బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనివల్ల ఈ లోహాలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి.
* హైదరాబాద్‌లో: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,300 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,110గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,39,900 మార్కును తాకింది.
* విజయవాడ, విశాఖపట్నంలో కూడా: హైదరాబాద్‌తో దాదాపు సమానంగానే ధరలు ఉన్నాయి. ఇక్కడ కూడా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,10,300, 22 క్యారెట్ల బంగారం రూ. 1,01,110గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,39,900గా నమోదైంది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో ధరలు
* ఢిల్లీలో: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,450 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,260గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,30,100 వద్ద ఉంది.
* ముంబైలో: 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,10,300, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,110గా ఉంది. వెండి కిలో ధర రూ. 1,30,100 వద్ద ఉంది.
* చెన్నైలో: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,10,740గా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,510గా నమోదైంది. కిలో వెండి ధర రూ. 1,39,900గా ఉంది.


