Ileana D'Cruz

Ileana D’Cruz: రెండోసారి తల్లైన ఇలియానా.. చిన్న కొడుకుని పరిచయం చేసిన గోవా బ్యూటీ!

Ileana D’Cruz: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డి’క్రూజ్ మరోసారి తల్లి అయ్యారు. తన రెండో బిడ్డ, కుమారుడు కీను రాఫ్ డోలన్‌ను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. జూన్ 19న జన్మించిన చిన్నారి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “మా హృదయాలు నిండిపోయాయి” అని హృదయస్పర్శిగా రాసుకొచ్చారు.

Also Read: Top Kollywood Heroes: టాప్ కొలీవుడ్ హీరోస్ 100 కోట్ల క్లబ్‌లో రాజులెవరు?

Ileana D’Cruz: ఇలియానా, మైఖేల్ డోలన్‌ని 2023లో వివాహం చేసుకున్నారు. వీరి మొదటి సంతానం కోవా ఫీనిక్స్ డోలన్ 2023 ఆగస్టులో జన్మించాడు. గోవా బ్యూటీగా పేరొందిన ఇలియానా, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడతారు. అయితే, ఈ సందర్భంలో అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలియానా షేర్ చేసిన చిన్నారి ఫోటోకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *