Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన లండన్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన వాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ కోసం లండన్ చేరుకున్నారు. మే 9వ తేదీన జరగనున్న ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం రామ్‌చరణ్ స్టైలిష్ లుక్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. క్యాప్, సన్‌గ్లాసెస్‌తో కూల్‌గా దిగిన ఆయన చుట్టూ అభిమానులు గుమిగూడటం విశేషం.
రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన విగ్రహం ఏర్పాటు కావడం భారతీయ సినిమా అభిమానులకు గర్వకారణం. ఈ ఈవెంట్లో రామ్‌చరణ్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: Miss World 2025: మిస్ వరల్డ్ 2025: హైదరాబాద్‌లో అందాల సందడి.. సుందరీమణులకు ఘన స్వాగతం!
Ram Charan: అభిమానులు సోషల్ మీడియాలో ‘గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్’ అంటూ హోరెత్తిస్తున్నారు. ఈ విగ్రహం ఆవిష్కరణతో రామ్‌చరణ్ అంతర్జాతీయ స్థాయిలో మరింత పాపులారిటీ సంపాదించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఘట్టం టాలీవుడ్‌కు చిరస్థాయిగా నిలిచిపోనుంది.

