Gautam Gambhir: ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించిన భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు అడుగుపెట్టింది. ఈ విజయంతో టీమ్ ఇండియా పైన వచ్చిన విమర్శలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బలమైన ప్రతిస్పందననిచ్చారు. కొందరు విమర్శించడమే తమ పనిగా భావిస్తారు. వారు సమాజంలో వీటి ద్వారానే ఎదగాలి కాబట్టి ఇలా చేస్తారు అని గౌతమ్ అన్నాడు.
ఈ టోర్నమెంట్లో ఓటమి అనేదే లేకుండా భారత్ వరుస విజయాలతో ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, దుబాయ్ పిచ్ మీదే మ్యాచ్లు ఆడటం వల్ల భారత జట్టుకు ప్రయోజనం ఉందని మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై గంభీర్ ఇలా మాట్లాడాడు. దుబాయ్ పిచ్ వల్ల మాకు ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. మేము ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేశాం, అక్కడి పరిస్థితులు దుబాయ్ కంటే చాలా భిన్నంగా ఉంటాయి అని అన్నాడు.
ఈ టోర్నమెంట్లో ఇతర జట్లకు దుబాయ్ వేదిక కొత్తది అయితే, మాకు కూడా అంతే. ఇది మాకు కూడా తటస్థ వేదిక మాత్రమే. చివరిసారి ఈ స్టేడియంలో మేం ఎప్పుడు ఆడామో కూడా గుర్తులేదు. మా ప్లాన్ ప్రకారం, ఫైనల్ జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండాలి. ఎందుకంటే ఈ టోర్నమెంట్ ఉపఖండం పిచ్లపై జరుగుతోంది అని గంభీర్ వివరించారు.
Gautam Gambhir: న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో ఓటమిని ఎదుర్కొన్న తర్వాత, భారత జట్టు ఎంపికపై తీవ్ర విమర్శలు వచ్చాయి. స్పిన్ మరియు పేస్ బౌలింగ్ ను భారత్ ఎదుర్కోలేకపోతుందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో గంభీర్ స్పష్టంగా మాట్లాడాడు. నేను ఈ విమర్శలను పట్టించుకోను. నా పని 140 కోట్ల భారతీయులకు మరియు డ్రెస్సింగ్ రూమ్లోని సభ్యులకు నిజాయితీగా ఉండటమే. ఎవరు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా, నేను పట్టించుకోను అని టీమిండియా కోచ్ వ్యాఖ్యానించాడు.
Also Read: Steve Smith: సెమీస్‌లో ఓటమి.. వన్డేలకు ఆసీస్ కెప్టెన్ గుడ్‌బై |
స్పిన్ కాంబినేషన్స్ విషయానికొస్తే, ఐదుగురు స్పిన్నర్లలో ముగ్గురు ఆల్-రౌండర్లు ఉన్నారు. ప్రజలు వారిని మరచిపోతున్నారు. ఆ ముగ్గురు కూడా నాణ్యమైన ఆల్-రౌండర్లే. మేము మొత్తం స్క్వాడ్లో కేవలం ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్లను మాత్రమే ఎంచుకున్నాం. 15 మంది స్క్వాడ్ లో వారు సరిపోతారని మాకు అనిపించింది అని గంభీర్ తెలిపాడు.
అలాగే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ భారీ స్కోర్లు చేయలేకపోవడంపై కూడా గంభీర్ అతనిని వెనకేసుకొచ్చాడు. రోహిత్ శర్మ నుండి మేము ఏమీ ఆశిస్తున్నామో అది అతను చేస్తున్నాడు అని చెప్పాడు. మిగిలిన వారందరూ గరంకాలు చూసి ప్లేయర్ ప్రతిభను నిర్ధారిస్తారు కానీ మేము మ్యాచ్ లో అతను ప్రత్యర్థిపై తెచ్చే ఒత్తిడి మరియు జట్టుపై పెట్టే ఇంపాక్ట్ ఆధారంగానే అతని క్వాలిటీని నిర్ధారిస్తాంనని అన్నాడు. రెండిటికీ చాలా తేడా ఉంటుంది అని అన్నాడు. భారీ స్కోరు చేయడమే బ్యాటర్ ప్రధాన లక్షణం కాదని ఒక్కొక్క బ్యాటర్ కి ఒక్కొక్క రోల్ ఇచ్చామని రోహిత్ శర్మ తన రోల్ బాగా నెరవేరుస్తున్నాడని గంభీర్ చెప్పాడు.