Health Tips

Health Tips: ఈ పండ్లు పోషకాల గనులు.. ఇంపోర్టెడ్ పండ్ల కంటె ఎన్నో రెట్లు బెటర్

Health Tips: కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల చాలా మంది ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. పోషకాలు ఎక్కువ ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకుని మరీ తింటున్నారు. ఇక చాలా కాలంగా మన దేశం వివిధ రకాల పండ్లను దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నవి ఉన్నాయి. అయితే దిగుమతి చేసుకున్న పండ్ల కంటే మన దగ్గర సహజంగా లభించే పండ్లు మరింత పోషకాలతో నిండి ఉంటాయి. మన దగ్గర లభించే పండ్లలో పోషకాల గనిగా పిలిచే కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరి:
ఉసిరిని ఇండియన్ గూస్‌బెర్రీ అని కూడా పిలుస్తారు, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉత్తమ పండ్లలో ఒకటి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్లు, రవాణా సమయంలో పోషక విలువలను కోల్పోవచ్చు. కానీ ఉసిరి అలా కాదు. ఉసిరి..రసాలు, పొడులు, ఊరగాయలతో సహా వివిధ ప్రాసెస్ చేసిన రూపాల్లో అందుబాటులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన చర్మాన్ని సంరక్షించడంలో ఉసిరి ముఖ్య పాత్ర పోషిస్తోంది.

జామున్:
Health Tips: జామున్ లేదా ఇండియన్ బ్లాక్‌బెర్రీగా పిలిచే అల్ల నేరేడు పండు విలక్షణమైన రుచిని కలిగివుంటుంది. ఇందులో పుష్కలంగా ఆంథోసైనిన్లు ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. దిగుమతి చేసుకున్న బ్లాక్‌బెర్రీస్‌లా కాకుండా మన దగ్గర దొరికే పుల్లని లేదా చప్పగా ఉండే జామూన్‌కు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అది రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. ఇది హెల్త్​కు ఎంతో ముఖ్యమైనది.

కరోండా:
కరోండా లేదా ఇండియన్ క్రాన్‌బెర్రీ వాక్కాయ కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఉపఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే ఈ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థకు సహజమైన శక్తిని అందిస్తాయి. దిగుమతి చేసుకున్న క్రాన్‌బెర్రీస్ ప్రాసెస్ చేయబడి ఉంటాయి. మన దగ్గర ఉండే కరోండాను తాజాగా లేదా ఊరగాయగా తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియతో పాటు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

బేర్:
Health Tips: బేర్ పండ్లుగా పిలిచే రేగి పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ యొక్క పవర్‌హౌస్ అని చెప్పొచ్చు. దిగుమతి చేసుకున్న పండ్లలో చక్కెర స్థాయి ఎక్కువగానూ, ఫైబర్ తక్కువగానూ ఉంటుంది. మన దగ్గర దొరికే పండ్లు అలా ఉండవు. ఈ పండ్లు తక్కువ కేలరీల పండ్లు. ఇవి జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దేశంలోని చాలా ప్రాంతాలలో ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.

ALSO READ  Tirumala: విమాన వేంకటేశ్వరుడి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

నోని బెర్రీ:
నోని, మోరిండా ఫ్రూట్​గా పిలిచే తొగరు పండులో 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెప్తారు. దీన్ని ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ పండులో 150కి పైగా పోషకాలు ఉంటాయి. ఈ పండు జ్యూస్​ను సేవిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని కూడా నివారించవచ్చు. దీన్ని మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *