Ganja Farming

Ganja Farming: వీడు ఎవడ్రా బాబు.. ఏకంగా ఇంట్లోనే గంజాయి పెంచుతున్నాడు

Ganja Farming: కొంతకాలంగా తెలుగురాష్ట్రాల యువకులు మత్తుకి బానిసలుగా మారడం చూస్తూనే ఉన్నాం.. తాగిన మత్తులో వాళ్ళు చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇది అంత ఎందుకు అంటారా. గంజాయి మత్తుకు బానిసైన ఓ యువకుడు ఎవరికి తెలియకుండా ఇంట్లోనే రహస్యంగా గంజాయి మొక్కలను పెంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, పల్కపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పల్కపల్లి గ్రామానికి చెందిన యువకుడు నాగనులు మధు గంజాయికి బానిసయ్యాడు. గంజాయి కొనడానికి ప్రతిసారి బయటికి వెళ్లడం వెళ్లిన ప్రతిసారి పోలీసులకి భయపడుతూ కొనుగోలు చెయ్యడం ఎందుకు అనుకున్నాడు. ఈ క్రమంలో దాన్ని సేకరించడానికి బయటికి వెళ్లడం కంటే, ఇంట్లోనే సులభంగా పెంచుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలోకి తెచుకొచ్చాడు గంజాయి మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు.

ఇది కూడా చదవండి: IBoMMA Ravi Case: ఐ బొమ్మ రవిపై 10+3 సెక్షన్‌లు

గంజాయి సాగుచేస్తున్నారు అనే సమాచారం తెలియడంతో పోలీసుల మధు ఇంట్లో అకస్మాత్తు తనిఖీలు చేయగా గుట్టుగా పెంచుతున్న గంజాయి మొక్కను గుర్తించారు. గంజాయి సాగు చేయడం నేరం కావడంతో, పోలీసులు వెంటనే స్పందించి నిందితుడైన మధును అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి సాగు, రవాణా, వినియోగంపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిరంతర నిఘా ఉంచుతున్న నేపథ్యంలో ఈ ఉదంతం చర్చనీయాంశమైంది. యువత ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *