వరంగల్ లో దారుణం జరిగింది. వరంగల్లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముగ్గురు యువకులు సెప్టెంబర్15న తనను ఓయో రూమ్ కు తీసుకెళ్లి, బీరు తాగించి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. .
నిందితులు తాను చదివే కాలేజీలోనే బీటెక్ చదువుతున్నారని పేర్కొంది. కాలేజీలో పరీక్షలుండటంతో ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయలేదని, సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత అత్యాచారం విషయాన్ని యువతి తల్లికి చెప్పిందని సమాచారం. దీంతో తల్లీకూతురు కలిసి వరంగల్ పోలీసు కమిషనర్‌ను కలిసి విషయం చెప్పారు. పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ ఘటనపై ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు లాడ్జిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. లాడ్జి నిర్వాహకుల వద్ద స్వాధీనం చేసుకున్న ఆధార్ కార్డులను బట్టి ఒక యువకుడిది భూపాలపల్లి అని గుర్తించారు. నిందితలు ప్రస్తుతం పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. బాధితురాలని వైద్యసాయం నిమిత్తం భరోసా కేంద్రానికి తరలించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇంతెజార్ గంజ్ పీఎస్ సీఐ శివకుమార్ తెలిపారు.