Crime News

Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడి కోసం భర్తని హత్య చేసిన భార్య..!

Crime News: పెళ్ళికి ముందు ప్రేమించిన వ్యక్తి ని పెళ్ళిచేసుకుంటే అన్ని ఇంట్లోవాళ్లకి చెప్పే దైర్యం రాని జనాలు పెళ్లితర్వాత పార్టనర్ ని చంపేటపుడు  మాత్రం భయం కలగదు కేవలం చంపాలనే ఆలోచనల మాత్రమే వస్తాయి. హర్యానాకు చెందిన మోను (21) అనే యువకుడికి, తన్ను అనే యువతికి కొద్దిరోజుల క్రితమే వివాహమైంది. ఇటీవల తన్ను తన పుట్టింటికి వెళ్లగా.. జూన్ 8న ఆమెను తిరిగి అత్తారింటికి తీసుకురావడానికి మోను వెళ్లాడు. ఆ సమయంలో.. తాను చెప్పిన కెనాల్ (కాలువ) వద్దకు జీతం డబ్బులు తీసుకుని రావాలని భార్య తన్ను అతనికి ఫోన్ చేసి చెప్పింది. భార్య మాట నమ్మి మోను ఒంటరిగా అక్కడికి చేరుకున్నాడు. అయితే, అప్పటికే అక్కడ పొంచి ఉన్న తన్ను ప్రియుడు సోను, అతని స్నేహితులు హరి ఓమ్, అమన్‌లతో కలిసి మోనుపై ఒక్కసారిగా దాడికి తెగబడింది. వారు మోను స్పృహ కోల్పోయేంత వరకు నోరు, ముక్కు గట్టిగా నొక్కి పట్టి.. ఆపై అతడ్ని కాలువలోకి నెట్టేసి దారుణంగా హత్య చేశారు.

ప్రమాదంగా చిత్రీకరించే కుట్ర..

ఈ ఘోర హత్యను ఒక సాధారణ ప్రమాదంగా నమ్మించేందుకు నిందితులు పక్కా ప్లాన్ వేశారు. అందుకోసం మోనుకు చెందిన స్కూటర్‌ను ఆ కెనాల్ వడ్డనే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. అటు భర్త ఇంటికి తిరిగి రాకపోవడం, ఇటు అత్తారింటికి కూడా వెళ్లలేదని తెలియడంతో ఆందోళన చెందిన మోను కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో భాగంగా భార్య తన్నును ప్రశ్నించగా.. మోను కనిపించకుండా పోయిన రోజు తామిద్దరం అసలు ఫోన్‌లో మాట్లాడుకోలేదని చెప్పి బుకాయించింది.

కేసును మలుపు తిప్పిన డిజిటల్ సాక్ష్యాలు: జూన్ 11న మోను మొబైల్ ఫోన్‌ను అతని కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పగించారు. దాన్ని పరిశీలించగా లోపల డేటా మొత్తం పూర్తిగా డిలీట్ చేసి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. సైబర్ క్రైమ్ నిపుణుల సహాయంతో డిలీట్ అయిన డేటాను రికవర్ చేశారు. దీంతో మోను చనిపోయిన రోజు వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారని, చాటింగ్ కూడా చేశారని స్పష్టమైన ఆధారాలు లభించాయి.

నిందితుల అరెస్ట్..

సాంకేతిక ఆధారాలతో పోలీసులు తన్నును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, ఆమె తలవంచక తప్పలేదు. ప్రియుడు సోనుతో కలిసి హాయిగా జీవించడానికే భర్తను పక్కా ప్లాన్‌తో అంతమొందించినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది. ఈ కేసులో పోలీసులు భార్య తన్నుతో పాటు ఆమెకు సహకరించిన హరి ఓమ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన ప్రియుడు సోను, అతని స్నేహితుడు అమన్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *