Sai Pallavi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో ఉన్న సత్య సాయిబాబా సన్నిధిలో జరిగిన పూజల్లో ప్రముఖ సినీ నటి సాయిపల్లవి పాల్గొన్నారు. ఆలయానికి డిసెంబర్ 31న వచ్చిన ఆమె అక్కడే ఉండి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో సాయి పల్లవి పాల్గొన్నారు. తోటి భక్తులతో కలిసి ఆమె పూజల్లో పాల్గొన్నారు. కీర్తనలు ఆలపిస్తూ పదం కలిపారు.
Sai Pallavi: అదే విధంగా పుట్టపర్తిలోని సత్యసాయిబాబా ఆలయ పరిధిలోని సాయి మహా సమాధిని సాయి పల్లవి సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిని స్మరించుకున్నారు. ఆయనను ఉద్దేశించి వేడుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా విడుదల కాగా, తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో, హిందీ రామాయణం సినిమాలో రణబీర్‌కపూర్‌తో కలిసి సాయిపల్లవి నటిస్తున్నారు.