Prakash Jain: ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు. దోఆని పట్టణంలో కూటమి ఎమ్మెల్యే పార్థసారథి రాజకీయ విధానాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ తెలిపారు. కూటమి నేతలకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడంలేదని, వైసిపి పార్టీ నుంచి వచ్చి బిజెపి పార్టీ లో చేరిన వారికే కాంట్రాక్టు వర్కులు మరియు ఇతరేతరా సంబంధించిన కోడిగుడ్లు కాంట్రాక్టులు,గ్రామాలో సంభందించిన ఫీల్డ్ వర్కు లు ,డీలర్ షిప్ పార్టీ కోసం కష్ట కార్యకర్తలకు ఇవ్వకుండా ఎమ్మెల్యే పార్థసారథి తనకు నచ్చిన వాళ్లకు ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రకాష్ జైన్ ప్రశ్నించారు.
కూటమి గెలుపు కోసం శ్రమించిన,టిడిపి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పై పలు ఆరోపణలు చేశారు.
గతంలో ఎన్నికల సమయం లో ఎమ్మెల్యే టిక్కెట్ విషయంలో మూడు కోట్ల వ్యవహారం ఆడియో కలకలం రేపింది అందరికి తెలుసు, అ విషయాన్ని పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి కి తెలిపిన వాళ్లపై ఏలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ కోసం ఇంత కష్ట పడినా నాకు షోకేస్ నోటిస్ ఇవ్వడం చాలా బాధాకరం . మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ బలోపేతం కోసం కష్ట పడతా గాని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అధ్యక్షతన కష్టపడేది లేదని తేల్చి చెప్పిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్
బిజెపి రాష్ట్ర కన్వీనర్.