Delhi: కఠిన పరిస్థితులు తరువాత భారత్ చైనా మధ్య సంబంధాలు మెల్లమెల్లగా కుదుటపడుతున్నాయి.ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో భారత్-చైనా బోర్డర్ సమస్యలు పరిష్కారం అయ్యాయి. చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు. దీన్ని పురస్కరించుకుని దీపావళి రోజున స్వీట్లు పంచుకున్నారు. తాజాగా బ్రెజిల్‌లో జరుగుతున్న జీ 20 సదస్సు కారణంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించబడే దిశగా అడుగులు పడుతున్నాయి.
తాజాగా ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభించే అంశంపై రెండు దేశాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కరోనా మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి.త్వరలోనే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు కైలాస మానసరోవరం యాత్ర పునఃప్రారంభం అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. బ్రెజిల్‌లో జరుగుతోన్న జీ20 సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా మంత్రి వాంగ్ యీ ఈ అంశాలపై చర్చించినట్లు సమాచారం.