Asia Cup Final 2025

Asia Cup Final 2025: భారత్ vs పాకిస్తాన్.. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి

Asia Cup Final 2025: ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడబోతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్‌లో ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. ఈ సంవత్సరం ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో భారత్ ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించింది. తాజాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ విజయం తర్వాత, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఫైనల్‌లో ఇండియాను ఓడిస్తామని సవాల్ విసిరాడు. భారత్ ఈ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉంది, ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరోవైపు, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌తో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

Also Read: IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన: యువ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్

ఆదివారం దుబాయ్‌లో జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ విజయంతో పాకిస్థాన్ ఫైనల్‌లో భారత్‌తో తలపడనుంది. భారత్ ఇప్పటికే సూపర్ 4 దశలో తన అన్ని మ్యాచ్‌లను గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఆసియాకప్‌లో ఫైనల్ చేరిన టీమ్‌ఇండియా ఇవాళ సూపర్-4లో శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్న భారత జట్టు పాక్ తో తుది పోరుకు ముందు ఫీల్డింగ్‌లో వైఫల్యాలను అధిగమించాల్సి ఉంది. మరోవైపు 2 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక నుంచి ఎలాంటి పోటీ ఎదురవుతుందో చూడాలి. దుబాయ్ వేదికగా రా.8 గంటలకు మొదలు కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *