Fire Accident: విజయవాడ నగరంలోని సితార గ్రౌండ్స్‌లో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అకస్మాత్తుగా వ్యాపించడంతో ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లు దగ్ధమయ్యాయి.గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వచ్చిన పెద్ద శబ్ధాలు వలన ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపించడంతో, అక్కడున్న వ్యాపారులు, సందర్శకులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.