Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పరిధిలో బుధవారం భయానక ఘటన చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిసరాలు దద్దరిల్లాయి. పేలుడు అనంతరం మంటలు భారీ ఎత్తున చెలరేగి, మొత్తం ఫ్యాక్టరీని మంటలు చుట్టుముట్టాయి.
