FIR Filed: బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై రాజస్థాన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. హ్యుందాయ్ కారు ప్రమోషన్‌కు సంబంధించిన ఫిర్యాదుతో కేసు ఫైల్ అయింది. సెలబ్రిటీల బాధ్యతపై డిబేట్ మొదలైంది. ఈ వివాదంలో ఏం జరిగింది? పూర్తి వివరాలేంటో చూద్దాం!
Also Read: Ghup Chup Ganesha: గప్‌చుప్ గణేశా సందడి.. ఘనంగా ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్!
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. స్థానిక న్యాయవాది కీర్తి సింగ్, 2022లో హ్యుందాయ్ అల్కాజర్ కారును షారుఖ్, దీపికా ప్రమోషన్లను నమ్మి కొనుగోలు చేశారు. అయితే, కారులో వైబ్రేషన్స్, తక్కువ యాక్సిలరేషన్ సమస్యలు ఎదురయ్యాయని, డీలర్షిప్, హ్యుందాయ్ సంస్థ సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. కోర్టు ఆదేశాలతో మథురా గేట్ పోలీస్ స్టేషన్లో షారుఖ్, దీపికాతో పాటు ఆరుగురు హ్యుందాయ్ అధికారులపై కేసు నమోదైంది. మోసం, నమ్మకద్రోహం, కుట్ర ఆరోపణలతో ఐపీసీ, భారతీయ న్యాయ సంహిత కింద కేసు ఫైల్ అయింది. సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌పై చర్చలు ఊపందుకున్నాయి. 2019 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం, తప్పుదారి పట్టించే ప్రకటనలకు సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాలని నిబంధన ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు.

