Anantapur: తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో అందరికి తెలుసు.. తండ్రి కొంచం కోపంగా ఉన్న ఆ కోపంలో కూడా ప్రేమ ఉంటుంది.. కానీ ఈ తండ్రికి ఎంత కోపం వచ్చిందో చిన్న పిల్ల అని కూడ చూడకుండా ఇంత కర్కశత్వంగా కొట్టాడు.. బయపెట్టాలనే కొడితే ఇంత విచక్షణ రహితంగా కొడతాడా.. అసలు మనిషేనా వాడు అంటున్నారు స్థానికులు.
అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ తండ్రి కర్కశత్వం ప్రదర్శించాడు.. కాలితో తన్నుతూ, గొంతు కొరుకుతూ మృగంలా ప్రవర్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలోని వన్‌టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన శివ, మౌనిక కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల కుమారై మేఘన సంతానం.
Also Read: Crime News: విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో దారుణం
వీరు మూడు నెలల క్రితం అనంతపురంలోని జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పావని బాలుర ప్రైవేట్ వసతి గృహంలో వంట మనుషులుగా చేరారు. కుమారై వసతి గృహంలోని గదుల్లోనూ, విద్యార్ధులు భోజనం చేసే సమయంలోనూ మల,మూత్ర విసర్జన ఎక్కడిపడితే అక్కడ చేస్తోందని కోపగించిన తండ్రి శివ.. చిన్నారిని భయపెట్టాలని విచక్షణారహితంగా కొట్టాడు. చెంపపై కొట్టి గట్టిగా బుగ్గలు కొరికాడు.. దీంతో ఆ చిన్నారి నొప్పిని భరించలేక విలపించింది. గుక్కపట్టి ఏడ్చింది.
పాప అరుపులు విన్న స్థానికులు దాడి దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐసీడీఎస్ అధికారులు ఇచ్చిన సమాచారంతో వన్‌టౌన్ పోలీసులు రంగప్రవేశం చేశారు.. ఘటనాస్థలికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు.. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.