వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం నవంబర్ లో మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో అక్టోబర్ 31వ తేదీ లోపు అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిష్ట్ ను ఐపీఎల్ కమిటీకి సమర్పించాల్సి ఉంది.ఈ నేపథ్యంలో రిటెన్షన్, రైట్ టు మ్యాచ్‌గా ఫ్రాంచైజీలు ఎవరిని ఎంచుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌కు ముందు కెప్టెన్సీ వేటు ఎదుర్కొన్న రోహిత్ శర్మను ముంబయి తీసుకుంటుందా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
ఈ క్రమంలో టీమిండియా–న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో ఆసక్తిక సన్నివేశం చోటు చేసుకుంది. అభిమానుల నుంచి రోహిత్ కు ఊహించని విధంగా ఓ విజ్ఞప్తి వచ్చింది. దానికి అతడు ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్‌గా మారింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో రోహిత్‌కు అభిమానుల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ‘భాయ్ నువ్వు ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉంటావు?’ అని ఓ ఫ్యాన్ అడిగాడు. దానికి రోహిత్ స్పందిస్తూ… ‘నీకేం కావాలో చెప్పు?’ అని ప్రశ్నించాడు. ‘భయ్యా నువ్వు ఆర్సీబీకి వచ్చేయ్’ అంటూ సదరు అభిమాని కోరాడు. ఆ మాటలను విన్న రోహిత్ చేయి ఊపుతూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
ఐదుసార్లు ముంబయిని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ వేలంలోకి వస్తే భారీ మొత్తం దక్కించుకోవడం ఖాయమని ఇప్పటికే మాజీలు కొందరు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముంబయి జట్టే రోహిత్‌ను రిటైన్ చేసుకుంటుందనే వార్తలూ వస్తున్నాయి.
Fan: "Which team in the IPL"
Rohit Sharma replied "Where do you want"
Fan: "Come to RCB"
Typical Rohit Sharma 😄👌 pic.twitter.com/A4XHZF8A3p
— Johns. (@CricCrazyJohns) October 19, 2024