Sreeleela: ఇటీవల శ్రీలీల నటించిన మరో చిత్రం ‘రాబిన్ హుడ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఉగాది సందర్భంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో శ్రీలీల ఖాతాలో మరో ఫ్లాప్ చేరింది.
అయినప్పటికీ, ఈ యంగ్ బ్యూటీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో టాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాదు, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతోంది ఈ చిన్నది. హ్యాండ్సమ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.ఇదిలా ఉంటే, ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
Also Read: Rashmika – Vijay: మళ్లీ తెరపైకి క్రేజీ జంట.. ఒమన్‌లో రష్మికతో విజయ్ దేవరకొండ?
Sreeleela: కార్తీక్ ఆర్యన్, శ్రీలీల హాజరైన ఈ ఈవెంట్‌లో స్టేజ్ వైపు వెళ్తుండగా, కొందరు ఆకతాయిలు శ్రీలీలను పట్టి లాగారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది స్పందించి ఆమెను స్టేజ్‌పైకి చేర్చారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనతో శ్రీలీల షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగించింది.
నటి శ్రీలీలకు చేదు అనుభవం.. చేయి పట్టుకుని లాగిన ఆకతాయిలు
ప్రేమ కథా చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇందు కోసం చిత్రబృందం ఇటీవల డార్జిలింగ్‌కు వెళ్లింది. చిత్రీకరణ అనంతరం కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఆమె తిరిగి వస్తుండగా.. వారిని చూసేందుకు… pic.twitter.com/lAACOHAg1U
— ChotaNews App (@ChotaNewsApp) April 6, 2025

