Crime News: ఆంధ్రప్రదేశ్ లోని కడపలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు… మృతిచెందారు. నగరంలోని శంకరాపురానికి చెందిన శ్రీరాములుకు…తన మేనమామ కుమార్తెతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఔషధ దుకాణంలో పనిచేస్తున్న శ్రీరాములు. మద్యానికి బానిసై రోజు భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా దంపతులిద్దరూ గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి. చచ్చిపోవాలని నిర్ణయానికొచ్చారు. ఏడాది వయసున్న కుమారుడితో కలిసి బయటకు బయల్దేరారు.
ఇది కూడా చదవండి:BC Reservations: సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం!
ఇంట్లో నుంచి వెళ్లొద్దని శ్రీరాములు నాయనమ్మ ప్రాధేయపడినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లగానే..వృద్ధురాలు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత శ్రీరాములు. భార్య, కుమారుడితో కలిసి కడప రైల్వే స్టేషన్ లో గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో శంకరాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమేంటి? ఆత్మహత్య చేసుకునేంత తీవ్రమైన పరిస్థితులు ఎందుకు తలెత్తాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.