Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ చుట్టూ కేసుల కల్లోలం మళ్లీ ముసురుకుంది. నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు ఆయనకు 14 రోజుల న్యాయహిరాసత విధించింది. ఈ కేసులో రిమాండ్ విధించడంతో వంశీ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అది స్వీకరించి సోమవారం విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో, గతంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీకి బెయిల్ మంజూరైంది. అయితే, మరోవైపు అక్రమ మైనింగ్ కేసు కేసులో ఆయనపై రూ.192 కోట్ల మేర అక్రమ లాభాల ఆరోపణలు ఉండడంతో, ఆ ఆరోపణలపై మరో కేసు నమోదైనట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Donald Trump: అమెరికా ఎన్ఆర్ఐలకు ప్రెసిడెంట్ ట్రంప్ భారీ షాక్
అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో వంశీ ఆసుపత్రిలో చికిత్స పొందాలన్న అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం, పోలీసులను వెంటనే ఆయనను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించాలంటూ ఆదేశించింది. ఈ నేపథ్యంలో వెంటనే వంశీని ఆసుపత్రికి తరలించనున్నారు.
ఈ కేసులు రాజకీయంగా, న్యాయపరంగా రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. వంశీపై వచ్చిన ఆరోపణలపై అధికార పార్టీ వర్గాలు మౌనం పాటిస్తుండగా, ప్రతిపక్షం మాత్రం ఈ విచారణపై దృష్టి సారించింది.

