Maheshbabu: మ‌హేశ్‌బాబు అభిమానుల‌కు కిరాక్ అప్‌డేట్స్‌.. రాజ‌మౌళి సినిమాపై ఫుల్ డీటెయిల్స్‌

Maheshbabu:సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు అభిమానుల‌కు పండుగ చేసుకునే వార్త బ‌య‌ట‌కొచ్చింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో తెర‌కెక్క‌నున్న సినిమాపై చాలా విష‌యాలు బ‌య‌ట‌కొచ్చాయి. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి ఇప్ప‌టికే సినీ స‌ర్కిళ్ల‌లో హైప్ క్రియేట్ అయింది. మ‌హేశ్‌బాబు అభిమానులే కాదు.. రాజ‌మౌళి సినిమా అంటే ఓ రేంజి అని భావించే సినీ ప్రియుల‌కూ ఈ వార్త‌లు సంచ‌ల‌నంగా మార‌నున్నాయి.

Maheshbabu: రాజ‌మౌళి తాజాగా చెప్పిన మ‌రికొన్ని విష‌యాల‌తో ఆకాశ‌మంత వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఓ అంత‌ర్జాతీయ స్థాయి ఈవెంట్‌లో మ‌హేశ్‌బాబుతో తీసే సినిమాపై ప‌లు ఆస‌క్తిక‌ర అంశాల‌ను రాజ‌మౌళి పంచుకున్నారు. ఇప్పుడు సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్స్‌ ఉంటాయ‌ని తొలి నుంచి రాజ‌మౌళి చెప్తూ వ‌స్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో వాడిన జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయ‌ని ద‌ర్శ‌క‌ధీరుడే స్వ‌యంగా చెప్పారు.

Maheshbabu: మ‌హేశ్‌బాబుతో రాజ‌మౌళి సినిమా ఎనౌన్స్ చేసి ఏండ్లు గ‌డుస్తున్నా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహేశ్‌బాబు అభిమానులు, సినీ ప్రియుల‌కు మ‌రో విష‌యం ఆనందాన్నిస్తున్న‌ది. జ‌న‌వ‌రి నెల‌లోనే సెట్స్ మీదికి వెళ్ల‌నున్న‌ట్టు తేల్చారు. ఇది వారికి గుడ్ న్యూస్ అని చెప్ప‌వ‌చ్చు. అడ‌వుల్లో సాహ‌సాల‌తో కూడిన సినిమాలంటే మ‌న‌కు హాలీవుడ్ సినిమాలే గుర్తొస్తాయి. హాలీవుడ్ రేంజి ప్ర‌మాణాల‌తోనే అడ‌వుల నేప‌థ్యంలో సినిమాకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు మ‌రో వండ‌ర్ వార్త‌ను అంద‌జేశారు.

Maheshbabu: ఇక విజువ‌ల్ ఎఫెక్ట్స్ పరంగా సాంకేతిక పరిజ్క్షానాన్ని ఉప‌యోగించ‌బోతున్న‌ట్టు రాజ‌మౌళి ప్ర‌క‌టించారు. దీనికోసం హాలీవుడ్ సంస్థ అయిన ఏ స్టూడియోతో క‌లిసి వ‌ర్క్ చేయ‌నున్నారు. దీంతో హాలీవుడ్ రేంజిని ఊహించుకోవ‌చ్చ‌న్న‌మాట‌. దీన్నిబ‌ట్టి ఈ సినిమా మ‌రో వండ‌ర్ అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావించ‌వచ్చు.

Maheshbabu: మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏమిటంటే.. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయ‌నున్నార‌ని తెలిసింది. క‌థ నిడివి ప‌రంగా రెండు భాగాలు అయితేనే న్యాయం జ‌రుగుతుంద‌ని రాజ‌మౌళి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సినీలోకానికి మ‌రో స‌ర్ప్రైజింగ్ న్యూస్ ఏమిటంటే.. మ‌హేశ్‌బాబు-రాజ‌మౌళి కాంబో సినిమాకు గ‌రుడ అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదైతేనేమి కానీ త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమా ప్రేక్ష‌కులు ఆశించిన దానికంటే ఎక్కువ‌గానే ఉంటుంద‌ని మాత్రం చెప్పుకోవ‌చ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *