firing

Firing: ఎమ్మెల్యేపై కాల్పులు.. పలువురికి గాయాలు

Firing: హిమాచల్ ప్రదేశ్‌లో, బిలాస్‌పూర్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ పై కాల్పులు(Firing) జరిగాయి. ఇందులో బాంబర్ ఠాకూర్(Bambar Thakur) తో పాటు, ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్ఓ), మద్దతుదారులు గాయపడ్డారు. బాంబర్ ఠాకూర్, PSO కి మూడు బుల్లెట్లు తగిలాయి. మద్దతుదారునికి పెల్లెట్లు తగిలాయి.

బాంబర్ ఠాకూర్‌ను ఐజిఎంసి సిమ్లాకు, పిఎస్‌ఓను బిలాస్‌పూర్ ఎయిమ్స్‌కు వైద్య సహాయం కోసం పంపించారు. డాక్టర్స్ చెబుతున్న దాని ప్రకారం బాంబర్ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇందులో నలుగురు నిందితులు కనిపిస్తున్నారు. నిందితుల్లో ఒకరు కాల్పులు జరుపుతున్నట్లు స్పష్టంగా రికార్డ్ అయింది.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. ఏడాది క్రితం కూడా బాంబర్ ఠాకూర్ పై దాడి జరిగింది. ఆ సమయంలో, అతని పన్ను ఒకటి విరిగిపోయింది. అయితే, ప్రధాన నిందితుడిని తరువాత కాల్చి చంపారు.

ఇది కూడా చదవండి: Vadodara Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం.. ఒక మహిళ మృతి

అందిన సమాచారం ప్రకారం, బాంబర్ ఠాకూర్ మధ్యాహ్నం చంద్ర సెక్టార్‌లోని తన భార్యకు కేటాయించిన ప్రభుత్వ నివాసంలో తన మద్దతుదారులతో హోలీ ఆడుతున్నాడు . ఈ సమయంలో, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై 10 నుండి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఇందులో బాంబర్, అతని పీఎస్ఓ సంజీవ్, మద్దతుదారు విశాల్ గాయపడ్డారు.
ముగ్గురినీ ప్రథమ చికిత్స కోసం బిలాస్‌పూర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడి నుండి బాంబర్, సంజీవ్‌లను వేర్వేరు ఆసుపత్రులకు పంపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Manipur Violence: మణిపూర్ లో మళ్ళీ దాడులు.. విపక్షాల విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *