Etala rajendar: బీసీలకు రిజర్వేషన్ల అమలుపై బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో స్పందించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేసినట్టు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి ఓబీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదని మండిపడ్డారు.
“రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా మోసం చేసింది. మోసం చేసింది ఎవరో ప్రజలు ఇప్పటికే తేల్చేశారు. ఈ విషయంలో బీజేపీ స్పష్టమైన స్థానం లో ఉంది,” అని ఈటల పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన న్యాయస్థానాల తీర్పులను గుర్తు చేస్తూ, “రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే… మేం ముఖ్యమంత్రి భరతం పడతాం. ఈ విషయంపై తేల్చుకుంటేనే మంచిది,” అంటూ హెచ్చరించారు.
ఈటల వ్యాఖ్యలు బీసీల రాజకీయ భవిష్యత్తును పురోగమించే దిశగా నూతన చర్చలకు దారితీయనున్నాయి. రాష్ట్రంలో రిజర్వేషన్ల వివాదం మళ్లీ వేడి పుంచుకోనుంది.

