England Fast Bowler: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి టీ 20 సిరీస్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. రెండవ మ్యాచ్ లో భారత బ్యాటలు ధాటిగా ఆడే క్రమంలో వికెట్లు ఇచ్చారు తప్పించి ప్రత్యర్థి పేస్ దళం వద్ద మునుపటి పస లేదని తేలిపోయింది. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాము ఒకటే ప్లాన్ తో ప్రతీ మ్యాచ్ లోనూ బరిలోకి దిగుతున్నట్లు అతను తెలిపాడు.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ కానీ గెలిచిన భారత జట్టు రాజ్ కోట్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. పైగా ఇంగ్లాండ్ బౌలింగ్ ను టీంఇండియా బ్యాటర్లు అలవోకగా బాదేస్తున్నారు. అయితే దీనిపై ఇంగ్లాండ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ ప్రస్తావిస్తూ తమ జుట్టు పేలవ బౌలింగ్ ప్రదర్శనను సమర్థించాడు. ముఖ్యంగా పేస్ విభాగానికి వస్తే వారు పరుగులను కట్టడి చేసే ఆలోచనలో అసలు లేరని ఖరాఖండిగా చెప్పేశాడు.
England Fast Bowler: తమ దృష్టి ఎప్పుడూ వికెట్లు తీయడం పైనే ఉందని… ఆ ప్రయత్నంలో కొద్ది పరుగులు ఎక్కువ ఇచ్చినా… తాము పట్టించుకునే స్థితిలో లేమని చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టు కోచ్ బ్రెండన్ మెక్ కలమ్ కూడా ఇదే ధోరణిని అలవర్చుకునేందుకు తమకు కావలసిన స్వాతంత్రం ఇచ్చాడని కూడా చెప్పడం గమనార్హం. అయితే రెండు టీ20 మ్యాచ్లలో మార్క్ వుడ్ మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ అతని తోటి స్టార్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ మాత్రం రెండవ మ్యాచ్ లో దాదాపు 60 పరుగులు సమర్పించుకున్నాడు.
టి20 అనేది బౌల్డర్లకు ఒక డిఫెన్స్ టెస్ట్. పరుగులను కట్టడి చేస్తే… ఒత్తిడిలో ప్రత్యర్థి బ్యాటర్లు భారీ షాట్స్ ఆడే క్రమంలో తామంతటామే వికెట్లు ఇస్తారు. వికెట్ కోసం బంతులు వేసినప్పుడే అవి బౌండరీల రూపంలో మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు టి20 క్రికెట్ కు సంబంధించి ఇదే సూచిస్తారు. అయితే ఇంగ్లాండ్ ధోరణి మాత్రం ఎప్పుడూ వేరేలా ఉంటుంది. టెస్ట్ క్రికెట్లో వన్డే తరహాలో వేగంగా పరుగులు చేయడం, టి20లో పరుగులు కట్టడి చేయడం కంటే వికెట్లు తీయడమే ముఖ్యం అనే వారి భిన్న శైలి తరచుగా బెడిసికొడుతుంది.
ఇది కూడా చదవండి: BBL 2024-25 Final: పురుషుల బిగ్ బాష్ లీగ్ విజేత హోబర్ట్ హరికేన్స్..!మిచ్ ఓవెన్ సునామీ సెంచరీ
అయినప్పటికీ వుడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయమే. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే తమ జట్టు తరఫున ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన ఆదిల్ రషీద్ ఉన్నాడని… తాము పెద్దగా బౌలింగ్ గురించి బెంగ చెందట్లేదని వుడ్ చెప్పాడు. మూడవ మ్యాచ్ జరిగే రాజ్ కోట్ బ్యాటింగ్ కు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడ వుడ్ చెప్పినట్లు వారి ప్రణాళిక ఫలిస్తుందా లేదా మళ్ళీ భారత బాటర్లు చెల్లరేగుతారా అన్న విషయం తెలుసుకోవాలంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.