The Ashes 2025-26: యాషెస్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లాండ్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పింక్ బాల్‌తో జరుగుతుండడం వలన ఇది మరింత ఆసక్తికరంగా మారనుంది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ XIలో ఊహించని మార్పులు చేసింది. కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. ఆస్ట్రేలియా యాజమాన్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూ, వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్‌ను తప్పించి ఆల్-పేస్ అటాక్ (నలుగురు పేసర్లు) వైపు మొగ్గు చూపింది. లియోన్ స్థానంలో ఆల్ రౌండర్ మైఖేల్ నెసర్ జట్టులోకి వచ్చాడు.
గాయపడిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా స్థానంలో జోష్ ఇంగ్లిస్ జట్టులోకి వచ్చాడు. తొలి టెస్ట్‌లో ఓటమి పాలైన ఇంగ్లాండ్ జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడిన పేసర్ మార్క్ వుడ్ స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్-రౌండర్ విల్ జాక్స్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్ట్‌లో ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్ అద్భుత ప్రదర్శనల కారణంగా ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఈ పింక్ బాల్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ పుంజుకుంటుందో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Karimnagar: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI) – జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (సి), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), విల్ జాక్స్ (మార్క్ వుడ్ స్థానంలో), గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI) – జేక్ వెదరాల్డ్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (ఉస్మాన్ ఖవాజా స్థానంలో), అలెక్స్ కారీ (WK), మైఖేల్ నేసర్ (నాథన్ లియాన్ స్థానంలో), మిచెల్ స్టార్క్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్.

