Encounter: నిజామాబాద్ జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్ హతుడు, పోలీస్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ నేరాల చిట్టాను పోలీస్ అధికారులు విప్పారు. కరోనా అనంతరం నేరాల బాటపట్టిన షేక్ రియాజ్‌పై గత ఐదేండ్లలో 61 కేసులు నమోదయ్యాయి. వాటిలో 50 కేసులు దొంగతనాల కేసులు ఉండటం గమనార్హం. ఒకవైపు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ దొంగతనాలు చేసేవాడని తమ విచారణలో వెల్లడైందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ చైతన్య వెల్లడించారు.
Encounter: నిజామాబాద్‌లోని మహ్మదీయ కాలనీలో నివాసముండే షేక్ రియాజ్ (28) పై నమోదైన 61 కేసుల్లో ఒకటి మర్డర్ కేసు ఉన్నది. మరో మూడు అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. 2 భారీ దోపిడీ కేసుల్లో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. మరో 5 చైన్ స్నాచింగ్ కేసులుండగా, 50 వరకు సాధారణ దొంగతనాల కేసులు ఉన్నాయి. ఇదే నెల (అక్టోబర్)17న కానిస్టేబుల్ ప్రమోద్‌పై రియాజ్ కత్తితో దాడి చేసి చంపాడు.
Encounter: హత్యకేసులో పోలీసుల అదుపులో ఉన్న రియాజ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం ఉంచగా, కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించగా, అక్కడే విధుల్లో ఉన్న ఆర్ఐ తుపాకీ అప్పగించాలని వార్నింగ్ ఇచ్చాడు. కానీ, అతుడు తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించగా, ఆత్మరక్షణ కోసం ఆర్ఐ తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులు జరపడంతో రియాజ్ అక్కడికక్కడే మరణించాడని సీపీ చైతన్య తెలిపారు.
Encounter: ఆసుపత్రిలో పోస్టు మార్టం అనంతరం రియాజ్ మృతదేహాన్ని అతని బంధువులకు పోలీసులు అప్పగించారు. అదే రోజు (అక్టోబర్ 20) అర్ధరాత్రి దాటాక రియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. తెల్లవారు జాము వరకు కొనసాగాయి. విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు జరపబోగా, ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పులు జరిపాలని పోలీస్ అధికారులు పేర్కొంటుండగా, పోలీసులు కావాలనే రియాజ్‌ను హత్య చేశారని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి.